- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ ఐదు వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా?
దిశ, స్పోర్ట్స్: బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించే ఐపీఎల్‌లో బౌలర్లు కూడా తమ సత్తాను చాటుతుంటారు. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లోనే హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ చెలరేగడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఐపీఎల్‌లో హర్షల్ పటేల్‌తో కలుపుకొని 22 మంది ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు. ఐపీఎల్ 2011లో నాలుగు సార్లు ఈ ఫీట్ నమోదు అవగా.. 2010, 2014, 2015లో ఒక్కసారి కూడా ఐదు వికెట్ల హాల్ నమోదు కాలేదు. మొదటి సారి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సొలైల్ తన్వీర్ 14 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి (5/20) ఈ ఫీట్ నమోదు చేశాడు.
5 వికెట్ల ఫీట్ నమోదు చేసిన ఆటగాళ్లు
1. సొహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్) – చెన్నైపై 6/14 (2008)
2. లక్ష్మిపతి బాలాజీ (చెన్నై సూపర్ కింగ్స్) – పంజాబ్‌పై 5/24 (2008)
3. అమిత్ మిశ్రా (ఢిల్లీ డేర్ డెవిల్స్) – డెక్కన్ చార్జర్స్‌పై 5/17 (2008)
4. అనిల్ కుంబ్లే (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) – రాజస్థాన్‌పై 5/5 (2009)
5. లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్) – ఢిల్లీపై 5/13 (2011)
6. హర్భజన్ సింగ్ (ముంబై ఇండియన్స్) – చెన్నైపై 5/18 (2011)
7. ఇషాంత్ శర్మ (డెక్కన్ చార్జర్స్) – కోచి టస్కర్స్‌పై 5/12(2011)
8. మునాఫ్ పటేల్ (ముంబై ఇండియన్స్) – పంజాబ్‌పై 5/21 (2011)
9. రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) – డెక్కన్ చార్జర్స్‌పై 5/16 (2012)
10. దిమిత్రి మస్కరెన్హాస్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) – పూణే వారియర్స్‌పై 5/25 (2012)
11. సునిల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – పంజాబ్‌పై 5/19 (2012)
12. జేమ్స్ ఫాల్కనర్ (రాజస్థాన్ రాయల్స్) – హైదరాబాద్‌పై 5/20 (2013)
13. జయదేవ్ ఉనద్కత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) – ఢిల్లీపై 5/25 (2013)
14. జేమ్స్ ఫాల్కనర్ (రాజస్థాన్ రాయల్స్) – హైదరాబాద్‌పై 5/16 (2013)
15. అడమ్ జంపా (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) – హైదరాబాద్‌పై 6/19 (2016)
16. ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్) – రైజింగ్ పూణేపై 5/17 (2017)
17. భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – పంజాబ్‌పై 5/19
18. జయదేవ్ ఉనద్కత్ (రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్) – హైదరాబాద్‌పై 5/30 (2017)
19. అంకిత్ రాజ్‌పుత్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) – హైదరాబాద్‌పై 5/14(2018)
20. అల్జారీ జోసెఫ్ (ముంబై ఇండియన్స్) – హైదరాబాద్‌పై 6/12 (2019)
21. వరుణ్ చక్రవర్తి (కోల్‌కతా నైట్ రైడర్స్) – ఢిల్లీపై 5/20 (2020)
22. హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) – ముంబైపై 5/27 (2021)
సన్ రైజర్స్ హైదరాబాద్‌పై అత్యధికంగా 6 సార్లు బౌలర్లు 5 వికెట్ల ఘనత సాధించడం విశేషం.