80 ఏళ్లుగా నో హెయిర్‌ కట్!

by Shyam |
80 ఏళ్లుగా నో హెయిర్‌ కట్!
X

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా కటింగ్ షాపులు తెరుచుకోకపోవడంతో మగాళ్లందరూ పెరిగిన జుట్టుతో జడలు వేసుకునే స్థాయికి వచ్చారు. ఒక్క రెండు నెలలు కత్తిరించుకోకపోతేనే ఈ స్థాయిలో పెరిగితే 80 ఏళ్ల నుంచి అసలు జుట్టుకు కత్తెర వేయకపోతే ఎంతలా పెరుగుతుందో మీకు తెలుసా? 5 మీటర్లు. ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలరు అని సందేహిస్తున్నారా? అయితే మీరు వియత్నాంకు చెందిన గ్యుయేన్ వాన్ చీన్ గురించి తెలుసుకోవాల్సిందే!

వియత్నాంలోని మెకాంగ్ డెల్టా ప్రాంతానికి చెందిన గ్యుయేన్ వయస్సు 92 సంవత్సరాలు. ఆయన గత 80 ఏళ్ల నుంచి వెంట్రుకలను కత్తిరించలేదు. అలా చేస్తే వెంటనే అతనికి మరణం సంభవిస్తుందని గ్యుయేన్ నమ్ముతాడు. అందుకే కేవలం జుట్టును కత్తిరించడం మాత్రమే కాకుండా దానిని దువ్వే ప్రయత్నం కూడా చేయడు. తొమ్మిది శక్తులను, ఏడుగురు దేవుళ్లను పూజించే చీన్.. తన ఐదు మీటర్ల జుట్టును మడిచి నారింజ రంగు తలపాగా కింద దాస్తాడు. తాను మూడో తరగతి చదువుకున్నపుడు చివరిసారిగా జుట్టు కత్తిరించుకున్నట్లు చీన్ చెప్పాడు. ఆ సమయంలోనే తన జుట్టుకు గట్టిగా మారి, తలకు విడదీయరాని భాగంగా తయారవడంతో దాన్ని భగవంతుని ఆదేశంగా భావించి జుట్టు కత్తిరించుకోవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కేవలం కొబ్బరి నీళ్లు తాగి మాత్రమే బతికే ‘దువా’ అనే మతాన్ని చీన్ పాటిస్తాడు. తన జుట్టును శుభ్రం చేయడంలో తన ఐదో కొడుకు లువామ్, చీన్‌కు సాయపడతాడు. జుట్టుకు, మోక్షానికి దగ్గరి సంబంధం ఉందని తాను కూడా నమ్ముతానని, ఈ విషయాలు సింపుల్‌గా అనిపించినా అవి పవిత్రమైనవని లువామ్ అంటున్నాడు.

Advertisement

Next Story

Most Viewed