భారత్‌లో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌..

by vinod kumar |
భారత్‌లో తొలి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌..
X

దిశ, వెబ్‌డెస్క్ :
హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ఈ ల్యాబ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐ క్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌ను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు 15 రోజుల్లోనే రెండు భారీ కంటైనర్లలో రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌-19 చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ డీఆర్‌డీవో అధికారులు పాల్గొన్నారు.

Tags: DRDO, ESI, Mobile virology,Corona tests, Rajanth singh, KTR

Advertisement

Next Story