- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ ఉత్కంఠ పోరులో గెలిచేదెవరో..?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 తుది అంకానికి చేరుకున్నది. రెండు దశల్లో.. రెండు దేశాల్లో నిర్వహించిన ఐపీఎల్ 2021 సీజన్‌లో లీగ్ దశ ముగిసి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నది. దుబాయ్ వేదికగా ఆదివారం జరుగనున్న తొలి క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నయ్ సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసి టాప్ 2లో నిలిచాయి. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు మొదటి నుంచి అగ్రస్థానం కోసం పోటీ పడింది. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నది. కానీ, ఆఖర్లో మూడు మ్యాచ్‌లు ఓడిపోయి రెండో స్థానానికి పరిమితం అయ్యింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చివరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి శ్రీకర్ భరత్ సిక్స్ కొట్టి ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడు. ఇప్పుడు ఈ రెండు జట్లు క్వాలిఫయర్‌తో తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఎంతో అనుభవంతో కూడిన చెన్నయ్ జట్టుతో కుర్రాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనున్నది.
ధోనీ అనుభవమే పెట్టుబడి..
చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. లీగ్ చరిత్రలో సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరుకోకపోవడం అదే తొలిసారి. అంతే కాకుండా గత ఏడాది పేలవ ప్రదర్శనతో ఎన్నో విమర్శలను మూట గట్టుకున్నది. కానీ ఏడాది తిరిగేలోపు చెన్నయ్ సూపర్ కింగ్స్ ఆట తీరే మారిపోయింది. ధోనీ నేతృత్వంలోని జట్టు వరుసగా విజయాలను సాధించింది. ముఖ్యంగా జట్టులోని యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఓపెనర్ డు ప్లెసిస్ ఓపెనింగ్ జోడి ఆ జట్టుకు వెన్నెముకలా నిలిచారు. జట్టు మొత్తం ఫామ్‌లో ఉండటం సీఎస్కేకు బలమైన అంశం. బౌలింగ్ విభాగంలో కూడా శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ఇబ్బంపెట్టగలుగుతున్నారు. అయితే అందరినీ కలవర పరిచే అంశాలు రెండే. కెప్టెన్ ఎంఎస్ ధోని, సురేశ్ రైనాలు ఫామ్‌లో లేకపోవడం సీఎస్కేను ఆందోళన పరుస్తున్నది. జట్టు గెలుపునకు అవసరమైన వ్యూహాలు రచించడంలో ధోనీ అనుభవం చక్కగా ఉపయోగపడుతున్నది. కానీ అతడు బ్యాటుతో పూర్తిగా విఫలం కావడమే పెద్ద మైనస్‌గా మారింది. ఈ సీజన్‌లో ధోనీ అత్యధిక స్కోర్ కేవలం 17 మాత్రమే కావడం గమనార్హం. మరి ప్లే ఆఫ్స్‌లో అయినా ధోనీ ఫామ్‌లోకి వస్తే సీఎస్కేకు మరింత బలం చేకూరుతుంది.
ఢిల్లీ కుర్రాళ్లోయ్..
కెప్టెన్ రిషబ్ పంత్‌తో సహా పలువురు క్రికెటర్లు అనుభవం తక్కువగా ఉన్నవాళ్లే. కుర్రాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ అంచనాలను మించి ఈ సీజన్‌లో రాణించింది. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టునే ఈ సీజన్‌లో రెండు సార్లు ఓడించింది. రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్అయ్యర్ దూరమైనా.. రిషబ్ పంత్ ఎంతో అనుభవం ఉన్న వాడిలా జట్టును నడిపించాడు. జట్టుకు కెప్టెన్‌గా విజయాలు అందిస్తున్నా.. గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ లేక సతమతమవుతున్నాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఫామ్‌లోకి రావడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి టచ్‌లో ఉన్నాడు. కానీ తొలి దశలో రాణించిన పృథ్వీషా రెండో దశలో ఫామ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే తీవ్రమైన ఒత్తడి ఉండే మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మేరకు రాణిస్తుందనే ప్రశ్నార్థకంగా మారింది. గత సీజన్‌లో ఫైనల్ చేరిన ఢిల్లీ జట్టు అనుభవం కలిగిన ముంబై ఇండియన్స్‌పై ఒత్తిడిని జయించలేక ఓడిపోయారు. మరి ఇప్పుడు ప్రత్యర్థిగా చెన్నయ్ సూపర్ కింగ్స్ వంటి ఛాంపియన్ జట్టు ఉండటంతో మరోసారి ఢిల్లీ ప్రదర్శనపై అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా లీగ్ దశలో కొన్ని స్వల్ప టార్గెట్లను కూడా కష్టంగా ఛేదించింది. బౌలర్లు రాణిస్తున్నా.. బ్యాటర్లు సరైన సమయంలో చేతులెత్తేస్తుండటం ఢిల్లీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు.
పిచ్: ఇక దుబాయ్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో 7 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఇక్కడి పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉన్నది.
తుది జట్ల అంచనా:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, షిమ్రోన్ హిట్‌మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడ, ఎన్రిక్ నోర్జే, అవేశ్ ఖాన్
చెన్నయ్ సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్
వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం
సమయం: రాత్రి 7:30 గంటలు
లైవ్: స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు
స్ట్రీమింగ్: డిస్నీ+హాట్‌స్టార్