భయపెడుతున్న ఖయ్యూమ్‌.. సీరియస్ లుక్‌లో సునీల్

by Shyam |
sunil
X

దిశ, సినిమా : సునీల్, ధన్‌రాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జీ ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పీ, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌తో పాటు ధన్‌రాజ్ చేస్తున్న సీఐ కేశ‌వ్ నాయుడు పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సునీల్ పాత్రకు సంబంధించిన లుక్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఆయన మహమ్మద్ ఖయ్యూమ్ అనే ముస్లిం పాత్రలో నటిస్తున్నాడు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకు డైరెక్టర్‌ గానే కాకుండా సినిమాటో గ్రాఫ‌ర్‌ గానూ వ‌ర్క్ చేస్తుండటం విశేషం.

ఇక ప్రముఖ ద‌ర్శకుడు జి. నాగేశ్వర‌రెడ్డి క‌థ‌, స్క్రీన్‌ప్లే సమకూర్చిన చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందించగా.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, శ్రీకాంత్ అయ్యర్‌, స‌త్యకృష్ణ, వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు నటిస్తున్నారు.

Advertisement

Next Story