- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటి జేమ్స్ బాండ్‌కు అశ్రునివాళి
దిశ, వెబ్‌డెస్క్: ‘బాండ్.. జేమ్స్ బాండ్..’ గూఢచారి సినిమాలను పాపులర్ చేసిన పేరు ఇది. పేరుతో పాటు ఆ పేరుకు సంబంధించిన స్పై కోడ్ ‘007’ కూడా ఎంతో పాపులర్. మరి ఇవి ఇంతలా పాపులర్ కావడానికి ఆ పాత్రలు పోషించిన నటీనటులే కారణం. చాలా మంది నటులు జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. అయితే మొట్టమొదట పోషించిన షీన్ కాన్నరీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తొంభై ఏళ్ల వయస్సులో బహమాస్‌లో ఆయన మరణించారు. దీంతో అటు జేమ్స్ బాండ్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచం షీన్ కాన్నరీకి అశ్రునివాళులు అర్పిస్తోంది.
జేమ్స్ బాండ్ పాత్రను ఆయన అంత బాగా పోషించాడు కాబట్టే ఆ సినిమాల పాపులారిటీకి పునాది అంత గట్టిగా పడింది. 1962 నుంచి 1983 వరకు ఏడు జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆయన జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. డాక్టర్ నో (1962), ఫ్రమ్ రష్యా విత్ లవ్ (1963), గోల్డ్ ఫింగర్ (1964), థండర్‌బాల్ (1965), యూ ఓన్లీ లివ్ ట్వైస్ (1967), డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971), నెవర్ సే నెవర్ అగైన్ (1983) సినిమాల్లో నటించి జేమ్స్ బాండ్ అంటే ఇలా ఉంటాడా? అనే ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. ఇవి కాకుండా ఆయన కెరీర్‌లో ‘మార్నీ, ద హిల్, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్, ద మ్యాన్ హూ వుడ్ బి కింగ్, ఎ బ్రిడ్జ్ టూ ఫార్, హైల్యాండర్’ లాంటి సినిమాలు ఎన్నో ఆయనకు పేరు తీసుకొచ్చాయి. 2006లో ఆయన నటన నుంచి రిటైర్ అయినప్పటికీ వాయిస్ యాక్టర్‌గా, గెస్ట్ పాత్రల్లో అడపాదడపా కనిపించారు. ‘ది అన్‌టచబుల్స్’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడుగా ఆస్కార్, బాఫ్తా అవార్డులు అందుకున్నారు. ఇక 1989లో సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్‌గా, 1999లో సెక్సీయెస్ట్ మ్యాన్ ఆఫ్ ద సెంచురీగా పీపుల్ మేగజైన్ ఆయనను గుర్తించింది.