- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాబ్‌లో.. డాగ్ బ్లడ్ బ్యాంక్
దిశ, వెబ్‌డెస్క్: ‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి’ ఇదేం కొత్త కొటేషన్ కాదు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నదే. ఆపదలో ఉన్న వ్యక్తికి రక్తం ఎంత అవసరమో వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్‌గా లాక్‌డౌన్ టైమ్‌లోనూ రక్తానికి షార్టేజ్ ఏర్పడింది. దాంతో చాలా మంది సహృదయులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. మరి ఇదే పరిస్థితి మనం ప్రేమగా పెంచుకునే శునకాలకు వస్తే ఏం చేయాలి? వాటికి రక్తం అత్యవసరమైతే ఎలా? పంజాబ్, లూథియానాలోని ‘గురు అంగద్ దేవ్ వెటెర్నిటీ అండ్ ఎనిమల్ సైన్స్ యూనివర్సిటీ’ వాళ్లు ఆ దిశగా ఆలోచించే.. నార్త్ ఇండియాలో తొలి ‘కెనైన్ బ్లడ్ బ్యాంక్’ను ప్రారంభించారు.
అనారోగ్యం పాలైన లేదా గాయాల పాలైన శునకాలను కాపాడేందుకు బ్లడ్ బ్యాంకు తోడ్పడుతుంది. భారత ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ అనుమతితో ఈ డాగ్ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. కాగా, ఈ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించడం పట్ల ఎంతోమంది పెట్ లవర్స్, కెనైన్ ఓనర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గాయాల పాలైన శునకాల అవసరార్థం.. బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఇందుకు కారణమైన ‘గురు అంగద్ దేవ్ వెటర్నిటీ కళాశాల’కు అభినందనలని పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ ట్వీట్ చేయడం విశేషం.
‘కుక్కలు అనేక రోగాలతో బాధపడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం 25 వేలకు పైగా ఇలాంటి కేసులు వస్తుండగా.. వీటిలో 500-600 కేసులకు సంబంధించిన కుక్కలలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ), ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ అనే మూడు భాగాలుగా వేరు చేస్తాం. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్న కుక్కలకు వాటిని ఎక్కిస్తాం’ అని వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుకృతి శర్మ తెలిపారు.
ఇప్పటివరకు 25 రాష్ట్రాలు డాగ్స్ బ్లడ్ బ్యాంక్ కోసం అప్లయ్ చేయగా.. కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఈ అవకాశాన్ని దక్కించుకున్నాయి. అందులో ఒకటి తమిళనాడు (చెన్నై) కాగా, రెండోది పంజాబ్ కావడం విశేషం.