పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌లో మొదటి హిందూ

by vinod kumar |
పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌లో మొదటి హిందూ
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌లో అక్కడి మెజారిటీ కమ్యూనిటీ ముస్లింలే ఉంటారు. కానీ మొదటిసారిగా అందులో ఒక హిందూ యువకుడు చేరాడు. అక్కడ హిందువులది మైనార్టీ కమ్యూనిటీ. ఇలా మైనార్టీకి చెందిన యువకుడు ఎయిర్‌‌ఫోర్స్‌లో చేరడం ఇదే మొదటిసారి. రాహుల్ దేవ్ తమ ఫోర్స్‌లో జనరల్ డ్యూటీ పైలెట్‌గా చేరినట్లు పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది.

కొవిడ్ 19 లాంటి ఆపత్కాల పరిస్థితుల్లో ఇదొక గుడ్ న్యూస్ అని, థర్పార్‌ఖార్ లాంటి ఒక మారుమూల ప్రాంతానికి చెందిన రాహుల్ దేవ్ తమ ఫోర్స్‌లో చేరినందుకు కంగ్రాచ్యులేషన్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పాకిస్థాన్ చరిత్రలో ఒక హిందువుని జనరల్ డ్యూటీ పైలెట్ స్థాయిలో నియమించుకోవడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడి పేపర్లు, మీడియా పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. గతేడాది ఫైటర్ పైలెట్ శిక్షణ కోసం మొదటిసారిగా కైనత్ జునైద్ అనే మహిళను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మొదటి మహిళా ఫైటర్ పైలెట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

Tags : pakistan, pilot, air force, minority, hindu, pak air force, community, muslim

Advertisement

Next Story

Most Viewed