- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైర్ ఇంజిన్లకు నీటి తిప్పలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వేసవి ముందే నగరంలో అగ్ని ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పాతబస్తీలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరుగగా ఉపాధ్యాయులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం నుంచి విద్యార్థులు తప్పించుకున్నారు. ఈ ప్రమాదం మరవకముందే ట్రూప్ బజార్, కోఠిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుని లక్షలాది రూపాయల ఆస్తులు మంటలకు ఆహుతయ్యాయి. బహుళ అంతస్తుల భవనాల్లో మంటలు చెలరేగితే కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో విలువైన ఆస్తులు అగ్గి పాలవుతున్నాయి. ఈ విషయంలో ఫైర్ సిబ్బంది ఉదాసీనంగా చూసీ చూడనట్లు వ్యవహరించడంతోనే నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి.
చలి కాలంలోనే నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం ప్రజలను కలవరపెడుతోంది. సాధారణంగా వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలు త్వరగా అదుపులోకి రావు. ఫైర్ సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుండడం చూస్తుంటాం. తాజాగా చలి కాలంలో అగ్ని ప్రమాదాలు తక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది కూడా రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటారు. ప్రమాదం జరిగిన అనంతరం ఒక్కోసారి ఫైర్ ఇంజిన్లు సైతం అందుబాటులో ఉండవు. దీంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటోంది. తాజాగా జరుగుతున్న ప్రమాదాల్లో ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్నా లక్షలాది రూపాయల ఆస్తినష్టం జరుగుతోంది. చలి కాలంలోనే ఇలా పరిస్థితులు ఉంటే వేసవి కాలంలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గౌలిపురాలో తృటిలో తప్పిన ప్రాణ నష్టం..
పాతబస్తీ గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూల్‌లో గత గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ కింది అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో స్కూల్లో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటలు చెలరేగిన అంతస్తులోని ఫర్నిచర్, రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించారు.
ఫైరింజిన్లు వెళ్లేందుకు దారేది …?
అనుకోని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగితే సకాలంలో ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిత్యం కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే బేగంబజార్, ఉస్మాన్ గంజ్, ఫీల్ ఖాన, ట్రూప్ బజార్, కోఠి, సుల్తాన్ బజార్, బడీచౌడి, ఇందర్ బాగ్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, మలక్ పేట్, న్యూ ఉస్మాన్ గంజ్, రిసాలా అబ్దుల్లా తదితర ప్రాంతాల్లో వీధులు ఇరుగ్గా ఉండడంతో ఫైరింజిన్లు సకాలంలో ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో ప్రమాద నష్టం అధికంగా ఉంటోంది.
ఫైర్ స్టేషన్లకు తప్పని తిప్పలు..
నగరంలోని ఫైర్ స్టేషన్లలో ఒక చోట నీరుండదు. మరో చోట సమయానికి వాహనం ముందుకు కదలదు. సిబ్బందికి సైతం సరైన సదుపాయాలు ఉండవు. సిబ్బంది సంఖ్య కూడా అంతంత మాత్రమే. ఒకేసారి ఒకటి, రెండు చోట్ల ప్రమాదాలు జరిగితే సిబ్బంది సర్దుకుపోతున్నారు. పొరపాటున ఆ సంఖ్య నాలుగైదుకు చేరుకుంటే వారు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. ఇదీ నగరంలోని అగ్నిమాపక శాఖ దుస్థితి. మూడేళ్ల క్రితం నాంపల్లి నుమాయిష్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం విధితమే. ప్రమాద సమయంలో అక్కడే మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు ఉన్నప్పటికీ వాటిలో నీళ్లు లేకపోవడం చర్చనీయాంశమైంది.