- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Dark humors : టేక్ ఇట్ ఈజీ బ్రో..! సీరియస్‌నెస్ వద్దు.. సింప్లిఫై ముద్దు!!

దిశ, ఫీచర్స్ : రేపు జరగబోయే పరీక్షను చాలా సీరియస్‌గా తీసుకుంది సరయూ.. దీంతో ఆమెలో అప్పటి దాకా ఉన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది. మేఘన కూడా అదే పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. కానీ.. ఆమె టేకిట్ ఈజీ అన్నట్లుగా ఉంది. రేపే పరీక్ష కదా అని అస్సలు టెన్షన్ పడట్లేదు. ఎగ్జామ్స్ అయిపోయాయి.. ఫలితాలూ వచ్చాయ్.. సరయూ తక్కువ మార్కులతో గట్టెక్కింది. మేఘనా ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. అంత సీరియస్‌గా చదివినా తక్కువ మార్కులు రావడంవల్ల ఇప్పుడు కూడా సరయూ ఏదో నిరాశ, నిస్పృహలో కూరుకుపోయింది. మేఘన మాత్రం ఎంతొస్తేంది అన్నట్లు ఇక్కడ కూడా విషయాన్ని సింపుల్‌గానే తీసుకొని సంతోషంగా ఉంటోంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. అనేక విషయాలను సీరియస్‌గా తీసుకునే వారికంటే.. వాటిని తేలికగా భావించేవారే జీవితంలో సంతోషంగా ఉంటారని కాగ్నెటివ్ ప్రాసెస్ జర్నల్‌లో పబ్లిషైన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అధ్యయనంలో భాగంగా మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ వియన్నాకు చెందిన ఉల్రికే విల్లింగర్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 33 సంవత్సరాలలోపు గల 156 మందిని పరిశీలించింది. ఇందులో 76 మంది మహిళలు కూడా ఉన్నారు. కాగా ఆయా సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను, బాధాకరమైన, అత్యవసరమైన పరిస్థితులను వ్యక్తులు ఏ విధంగా మేనేజ్ చేస్తారు? వాటి ప్రభావం వాళ్ల జీవితంపై ఎలా ఉంటోంది అనే విషయాలను విశ్లేషించారు.
కాగా బాధాకరమైన, భావోద్వేగ సందర్భాలను సైతం సింపుల్‌గా భావించడం, సామాజికంగా సున్నితమైన, నిషిద్ధమైన విషయాలను సైతం సీరియస్‌గా తీసుకోకపోవడం, పైగా ఆయా సందర్భాల్లో వాటిని వ్యంగ్యంగా, హాస్యంగా వ్యాఖ్యానించడం వంటివి చేసే వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటున్నారని, వీరిలో భావోద్వేగ స్థిరత్వం, ఐక్యూ లెవల్ ఎక్కువేనని పరిశోధకులు తేల్చారు. పైగా ఇలాంటి వ్యక్తుల్లో జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందని, జీవితంలో మానసిక సమస్యలను, అనారోగ్యాలను ఎదుర్కొనే చాన్స్ ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా డార్క్ హ్యూమర్ (Dark humor)అంటేనే విషయాలను సింప్లఫై చేయడం. ఇలాంటి వారు సంతోషంగా ఉండటమే కాదు, జీవితంలో ఎదరయ్యే సవాళ్లను ఈజీగా ఎదుర్కొంటారు. క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. వీరిలో ఐక్యూ కూడా ఎక్కువేనని నిపుణులు గుర్తించారు. మొత్తానికి అప్పటి సీరియస్ పరిస్థితిని సైతం హాస్యంగా, వ్యంగ్యంగా తీసుకోవడం, విషయాలను తేలికపర్చడం డార్క్ హ్యూమర్ వ్యక్తిత్వ లక్షణాలుగా ఉంటాయి. చివరికి మరణం, వ్యాధి, వైకల్యం వంటివి కూడా వీరు సహజమైన విషయాలుగానే భావిస్తారు. ఇలాంటి టేకిట్ ఈజీ ధోరణి కలిగి ఉండటమే ఆ వ్యక్తుల జీవితాన్ని ఆనందమయం చేస్తుందని, సక్సెస్ వైపు నడిపిస్తుందని నిపుణులు అంటున్నారు.