- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం
by Shyam |

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలోని మరో జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై అప్రమత్తమైన అధికారులు.. ఈ ప్రమాదంపై విచారణను ప్రారంభించారు.
Next Story