- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బల్దియా డంపింగ్ యార్డ్ లో అగ్ని ప్రమాదం

X
దిశ, కరీంనగర్ : నగరంలోని బైపాస్ రోడ్ లోగల బల్దియా డంపింగ్ యార్డ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువజామున మానేరు నదిని ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం వలన రెండు గంటలపాటు బైపాస్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణం నష్టం ఏమి జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. అయితే మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేక మున్సిపల్ సిబ్బంది చెత్త కాల్చారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story