నార్కట్‌పల్లి 220కేవీ సబ్‌స్టేషన్‌లో మంటలు

by Sumithra |
నార్కట్‌పల్లి 220కేవీ సబ్‌స్టేషన్‌లో మంటలు
X

దిశ, నల్లగొండ :
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని 220కేవీ సబ్ స్టేషన్‌లో బుధవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్న భారీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు ఫైర్ డిపార్ట్మెంట్‌కు సమాచారం అందించడంతో, ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.వాతావరణంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు లేదా సబ్‌స్టేషన్‌పై ఎక్కువ భారం పడటమే మంటలు చెలరేగడానికి కారణం అయి ఉండవచ్చని సిబ్బంది అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story