- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతున్నప్రాంతాలను కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలను అష్టదిగ్భందనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 6 ప్రాంతాలు రామయ్య బౌళి, మర్లు, బీకే రెడ్డి కాలనీ, సద్దలగుండు, షాషాబ్ గుట్ట (కొంత ప్రాంతం) జడ్చర్ల లోని కౌరమ్ పేటను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో… జిల్లా కేంద్రంలోని 37 వార్డులు, అయిజలో 12, 17, 19, 20 వార్డుల పరిధిలోని కమతంపేట, కాలమ్మపేట, రంగుపేట, తెలుగుపేట, గుర్రంతోట, ఉప్పరిపేట, కుమ్మరిపేట, నదీమ్ మసీద్ కాలనీ, బ్రాహ్మణ వీధి, సంత బజార్, అంబేడ్కర్ కాలనీ, టీచర్స్ కాలనీలను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. శాంతినగర్‌లో 7వ వార్డు పరిధిలోని జమ్ములమడుగుకు చెందిన ముగ్గురుకి పాజిటివ్ రాగా, ఒకరు మృతి చెందారు. దీంతో ఆవార్డుతో పాటు పక్కనున్న వడ్డెపల్లిని కంటైన్‌మెంట్ జోన్ గా ప్రకటించారు. శాంతినగర్‌లోని 3, 4, 5, 6, 8, 8, 10 వార్డులు, రాజోళి మండల కేంద్రం, ఇక నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్క్ కాలనీ, కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్, సుభాష్ నగర్ ప్రాంతాలను కంటైన్ మెంట్‌జోన్‌గా గుర్తించారు.
Tags: corona, hotspot, containment zones , mahabubnagar district, ts news