- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉద్యమ స్ఫూర్తితోనే కరోనా కట్టడి
by Shyam |
దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సకల జనులందరూ తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని చాటాలని టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మన్మెబోయిన కృష్ణ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నలాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపద్రవంలా ముంచుకొస్తున్న కరోనాను తరిమికొట్టాలని ఉద్యోగులను కోరారు. అందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు.
Tags : goa, corona, hyd, lockdown, krishna yadav
Next Story