- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోడి కూర ఎంత పని చేసింది..!
పెళ్లి భోజనాల్లో కోడి కూర వరుడు, వధువు కుటుంబాల మధ్య వివాదాన్ని రేపిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. సావరకోట మండల కేంద్రంలోని రెల్లివీధికి చెందిన కూన సురేష్, బూర్జ మండలం ఉప్పినివల గ్రామానికి చెందిన సవలాపురం నందిని (ఉష)తో వివాహం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనాల దగ్గర చికెన్ సరిగా వడ్డించడం లేదని పెళ్లి కుమార్తె వర్గానికి చెందిన వ్యక్తి ముఖానికి అతను వడ్డించిన ప్లేటుతో పెళ్లి కుమారుడి వర్గానికి చెందిన వ్యక్తి కొట్టాడు. దీంతో వివాదం రాజుకుంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. దీంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడి నుంచి వస్తూ రహదారిపై మరోసారి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రోడ్డుపైనున్న రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు.