- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు, పోలీసులకు మధ్య తోపులాట
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరో నంబరు హాల్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆరో నంబరు హాల్‌లో దాదాపు 8 బ్యాలెట్ బాక్సులు ఎలాంటి సీల్ లేకుండా ఉండడాన్ని ఏజెంట్లు గమనించారు. సీల్ లేకుండా ఉన్న బాక్సులను రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లకుండా బలవంతంగా నాలుగు బాక్సుల తాళాలను పగలకొట్టి బ్యాలెట్ పేపర్లను కౌంట్ చేసే ప్రయత్నం అధికారులు చేశారు. దీంతో అక్కడే ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీల్ లేకుండా ఉన్న బ్యాలెట్ బాక్సులను తాళాలు లేవనే పేరుతో పగలగొట్టడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు పలువురు ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.