రుణాలు ఇవ్వండి ప్లీజ్ -ఆతిధ్య రంగం 

by Harish |
 రుణాలు ఇవ్వండి ప్లీజ్ -ఆతిధ్య రంగం 
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి దెబ్బకు ఆతిథ్య రంగం పూర్తిగా కుదేలైంది. ఇటీవల లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి వ్యాపారాల కొనసాగింపునకు పచ్చజెండా ఊపినప్పటికీ పెద్దగా ఆదాయం లేదని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో కోలుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందడమే ప్రధానమని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభం సవాళ్లను అధిగమిస్తూ మూడు నెలల విరామం తర్వాత ప్రారంభమైన ఆతిథ్య రంగంలోని వ్యాపారాలు ప్రతికూలంగా ఉన్నాయని ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) అభిప్రాయపడింది.

దేశవ్యాప్తంగా కరోనాకు ముందు నాటి సగటు ఆదాయంలో ప్రస్తుతం 20-30 శాతం మాత్రమే నమోదవుతోందని, రానున్న రోజుల్లో వ్యాపారాలను కొనసాగించడం మరింత కష్టంగా ఉండనున్నట్టు ఎఫ్‌హెచ్ఆర్ఐ వెల్లడించింది. ఈ క్రమంలో పరిశ్రమ కోలుకునేందుకు, ఆర్థికంగా నష్టపోయిన హోటల్, రెస్టారెంట్ల వారికి అవసరమైన రుణాలను ఇవ్వాలని ఎఫ్‌హెచ్ఆర్ఏఐ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఆర్థిక సహాయం ద్వారా వ్యాపారాలకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోవచ్చని, రాబోయే కొన్నాళ్ల పాటు వ్యాపారాలను కొనసాగించేందుకు వీలవుతుందని వివరించింది. నవంబర్ నెలలో పండుగ సీజన్ ప్రారంభం కావడం, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులకు సెలవురోజులు కావడం కొంత కలిసొస్తుందని పరిశ్రమ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed