- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ అమ్మకాలు 2019 కంటే భారీగా పెరిగింది. ముఖ్యంగా యువతకు షాపింగ్ చేసేందుకు ఈ-కామర్స్ సైట్లు అందుబాటులో ఉండటంతో భారతీయ యువత ఖర్చు చేస్తున్నారని ప్రముఖ క్రెడిట్, చెల్లింపుల సంస్థ స్లైస్ వెల్లడించింది. 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన సుమారు 2 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ప్రకారం..2019తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్ అమ్మకాలు 77 శాతం పెరిగాయని తేలింది. అంతేకాకుండా 74 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగాయి. ఆఫ్‌లైన్‌లో కేవలం 26 శాతం మాత్రమే జరిగాయని స్లైస్ పేర్కొంది.
ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పండుగ సీజన్‌కు కొద్దిరోజుల ముందు ఈ-కామర్స్ సైట్లు వ్యాపారాలను నిర్వహించినప్పటికీ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడం విశేషమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సెప్టెంబర్ నుంచి యువతలో ఖర్చు చేసే విధానంలో పునరుజ్జీవనాన్ని చూస్తున్నాం. ఇది కరోనాకు ముందు కాలానికి చేరుకోవడమే కాకుండా ప్రతి వినియోగదారుని లావాదేవీల పరిమాణంలో 150 శాతం పెరుగుదల కనిపించిందని’ స్లైస్ సీఈవో, వ్యవస్థాపకుడు రాజన్ బజాజ్ చెప్పారు. 2020 పండుగ సీజన్‌లో డిజిటల్ లావాదేవీల్లో 71 శాతం కొనుగోళ్లు ఈఎంఐ ద్వారానే జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 58 శాతం అధికమని రాజన్ పేర్కొన్నారు.