- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోవా, కేరళ మ్యాచ్ డ్రా
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి జీఎంసీ స్టేడియంలో గోవా ఫుట్‌బాల్ క్లబ్, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 తో డ్రాగా ముగిసింది. టాస్ గెలచి గోవా ఎఫ్‌సీ ఎడమ నుంచి కుడికి ఆడటానికి నిర్ణయించకుంది. 6వ నిమిషంలోనే జార్జ్ మెండోజా గోల్ పోస్టుపై దాడి చేశాడు. కానీ గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి బయటకు బంతి వెళ్లిపోయింది. గోవా జట్టు మిడ్ ఫీల్డర్లు, స్ట్రైకర్లు బంతిని పదే పదే గోల్ పోస్టు వైపు పంపారు. 25వ నిమిషంలో జార్జ్ మెండోజా గోవాకు గోల్ అందించాడు. కేరళ బ్లాస్టర్స్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ అద్భుతమైన గోల్ చేసి ఆధిక్యత తీసుకొచ్చాడు.
రెండో అర్దభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 57వ నిమిషంలో పెరీర ఇచ్చిన పాస్‌ను కేరళ స్ట్రైకర్ రాహుల్ గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్ల స్కోర్ 1-1గా సమానంగా మారింది. 65వ నిమిషలో గోవా ఆటగాడు ఇవాన్ గొన్జాల్వేస్ రెండో ఎల్లో కార్డ్ పొంది బయటకు వెళ్లిపోయాడు. దీంతో మిగిలిన సమయం అంతా గోవా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినా సరే కేరళ దూకుడును అడ్డుకొని మరో గోల్ చేయనీయలేదు. నిర్ణత సమయం ముగిసే సరికి 1-1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పెరీరాకు డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, సందీప్ సింగ్‌కు హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.