- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దారుణం.. ఆరేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం
by Aamani |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకూ మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంత దారుణంగా సమాజం తురవుతుందంటే సాక్షాత్తు కన్న తండ్రే కూతురిపై అత్యాచారం చేసే దౌర్భాగ్యపు పరిస్థితులను నేడు మనం చూస్తున్నాం. వావి వరుసలు లేకుండా క్రూర మృగాళ్లా తయారై మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. సోన్ మండలం గాంధీనగర్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో భయపడ్డ నిందితుడు పరుగులు తీశాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బాలికను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story