- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సంఘాల హెచ్చరిక
దిశ, నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ.. యాసంగి వరి పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరేంటో స్పష్టం చేయాలని, అంతేగాక వరి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని రెండు షుగర్ ఫ్యాక్టరీలను ప్రారంభించాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటల పట్ల ప్రజలను చైతన్యం చేసిన తర్వాతే వరి పంట సాగుపై నియంత్రణ చేయాలన్నారు. అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని అన్నారు. దీనిపై జిల్లా అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రైతులను వేధిస్తోన్న మిల్లర్లపై కేసులు నమోదు చేయాలన్నారు. పంటలకు మద్దతు ధర చట్టాన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, రామకృష్ణ, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సత్యక్క, సుధాకర్, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, వివిధ సంఘాల నాయకులు సురేష్, సాయగౌడ్, విఠల్, కిషన్, రాజేశ్వర్, ఒడ్డెన్న, సాయిలు, బాలయ్య, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.