- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరగంటకోసారి కరెంట్ పోతే ఎట్లా..
by Sridhar Babu |
X
దిశ, వేములవాడ: ‘రైతుల కాళ్ళకు ముళ్ళు గుచ్చితే పంటితో తిస్తా’ అన్న సీఎం కేసీఆర్ రైతులు పండించే పంటలు ఎండిపోతున్నా.. పట్టించుకుంట లేడు. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి, అరగంటకోసారి కరెంట్ పోతే పొలాలు ఎలా పారుతాయి. కనురెప్ప పాటు కూడా కరెంట్ పోదని గొప్పలు చెప్పిన కేసీఆర్, ఇప్పుడేమో రోజుకు పలుమార్లు కరెంట్ పోతుంది.’ అని కోనరావుపేట మండలం రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం మండలంలో అప్రకటిత కరెంటు సరఫరాను నిరసిస్తూ మండల కేంద్రంలోని కార్యాలయాన్ని ముట్టడించి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట చేతికి వచ్చే సమయానికి అరగంటకు ఒకసారి పదినిమిషాల కొకసారి కరెంటు పోవడంతో పొలానికి నీళ్లు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.
రోజుకు రెండు, మూడు గంటల కరెంటు సరఫరా చేసి మిగతా సమయంలో సరఫరా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పొలాలకు సరిగ్గా నీళ్లు అందక ఎండిపోతున్నాయని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆఫీస్‌కి వస్తే కరెంటోల్లు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆఫీసుకు తాళం వేశారు. ఇప్పటికైనా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసి, ఎండి పోయే వరి పంట పొలాలను కాపాడేలా చర్యలు చేపట్టాలని అఫీసర్లను రైతులు కోరుతున్నారు.
Advertisement
Next Story