భువనగిరిలో రైతుల ధర్నా

by Shyam |
భువనగిరిలో రైతుల ధర్నా
X

దిశ, భువనగిరి: విఖ్యాత డెవలపర్స్ అధినేత శ్రీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం భువనగిరి మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన రైతులు భువనగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భువనగిరి మండ లం తిమ్మాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 56 ఏలోని 32-38 ఎకరాల భూమిని హనుమాపురం గ్రామానికి చెందిన 30 మంది రైతులు అప్పటి జాగీర్ దార్ దగ్గర కొనుగోలు చేసి గత 150 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్నారు. ఆ భూములను విఖ్యాత డెవలపర్స్ అధినే తశ్రీధర్ రెడ్డి కేవలం 14 ఎకరాలు కొనుగోలు చేసి మిగతా భూమిని మొత్తం ఆక్రమించుకొని తమపై అక్రమంగా కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్న శ్రీధర్ రెడ్డిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, జిట్టా అంజి రెడ్డి, గ్రామ రైతులు పిట్టల పెదఎల్లయ్య, పిట్టల సత్యనారాయణ, మేడబోయిన సత్తయ్య, పి. కృష్ణ, పి.ఎల్లయ్య, పి. నాగులు, యు. హరినాథ్, శ్రీను, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed