తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

by Shyam |
Farmer Suicide Attempt
X

దిశ, గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మల్దికల్ మండలంలోని మద్దెలబండ గ్రామానికి చెందిన ఈరన్న అనే రైతు తన పొలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన ఈరన్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story