- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు నెలలకే… రూ.3.71 కోట్ల కరెంట్ బిల్లు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మూలంగా లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్న వాళ్లకు కరెంట్ బిల్లులు షాక్ కొట్టాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరికీ లక్షల్లో బిల్లులు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఈ విషయమై విద్యుత్ అధికారులపై కేసులు కూడా పెట్టారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఉదయ్‌పూర్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని జింగ్లా గ్రామానికి చెందిన ఓ రైతుకు ఏకంగా రూ.3.71 కోట్ల మేర విద్యుత్ బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వివరాళ్లోకి వెళితే… జింగ్లా గ్రామానికి చెందిన పెమరం పటేల్ వ్యవసాయం చేస్తున్నాడు. కాగా అతడికి ఆగస్టు 22న కరెంట్ బిల్లు వచ్చింది. రెండు నెలలకు కలిపి 3,85,14,098 యూనిట్లు వినియోగించినందుకు గాను రూ.3.71 కోట్లు చెల్లించాలని బిల్లులో అందులో ఉన్నది. బిల్లు చెల్లింపునకు చివరి తేదీ సెప్టెంబర్ 3గా పేర్కొన్నారు. దీంతో వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఈ సేవా కేంద్రానికి వెళ్లి విద్యుత్ బిల్లును చూపించాడు. కాగా ఆయనకు ఉన్న షాపును ఆటో సర్వీస్ కేంద్రం నిర్వహణ కోసం ఒకరికి అద్దెకు ఇచ్చాడు. కాగా మీటర్ తీసే వ్యక్తి పొరపాటున ఆ షాపునకు సంబంధించిన విద్యుత్ మీటర్ బిల్లును రైతు ఇంటి విద్యుత్ మీటర్‌కు చేర్చి తప్పుగా ఇచ్చాడు. ఈ పొరపాటును గుర్తించి సవరించినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో కొత్తగా ఇచ్చిన అసలు విద్యుత్ బిల్లు రూ.6.414ను వెంటనే చెల్లించిన ఆ రైతు ఊరట చెందాడు. కాగా రూ.3.71 కోట్ల విద్యుత్ బిల్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.