- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను జయించినోళ్లకు చప్పట్లతో వీడ్కోలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పోరాడి రికవరీ అయిన బాధితులకు చప్పట్లతో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు బయటకు వస్తుండగా చప్పట్లు కొడుతూ ఆస్పత్రి సిబ్బంది ఘనంగా స్వాగతం పలుకుతూ ఇంటికి సాగనంపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చినవారు ఏమాత్రం సంకోచించకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి నాణ్యమైన వైద్యం చేయించుకొని జబ్బును నయం చేసుకోవచ్చన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని విధాల సౌకర్యాలను కల్పిస్తూ వారిని తిరిగి కోలుకునే విధంగా కృషి చేసే దిశగా ఆసుపత్రి సిబ్బంది ఎళ్లవేళలా కృషి చేస్తున్నదని ఆమె తెలిపారు. కరోనా బాధితులు తమకు ఏదో జరుగుతుందనే భయంతో ఆందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఉంటే కోవిడ్ – 19ను జయించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతిరావు, ఆర్ ఎంఓలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.