- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధరణి లోపం.. రైతుకు శాపం…

దిశ, సత్తుపల్లి : రైతు పక్షపాతిగా చెప్పుకునే తెలంగాణ సర్కార్ రైతుల ఇక్కట్లు తొలగించేందుకంటు రూపొందించిన ధరణి వెబ్‌సైట్ రైతుల పాలిట శాపంగా మారిందనటంలో ఏమాత్రం సందేహాం లేదు. ఇందుకు నిలువెత్తు తార్కాణం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మోరంపూడి గోపాలరావు అనే సన్నకారు రైతుకు బేతుపల్లి చెరువు ఆయకట్టులో వారసత్వంగా వచ్చిన 2ఎకరాల24 కుంటల భూమినే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నాడు.
ధరణి వెబ్‌సైట్‌లో తన భూమిని ఎక్కించిన రెవెన్యూ అధికారులు తనకున్న విస్తీర్ణంలో 1.03కుంటల భూమిని అదే గ్రామానికి చెందిన మోరంపుడి వసంతరావు అనే రైతు పేరిట కొత్తపాసుపుస్తకాలు అందజేశారు. నాటి నుంచి గోపాలరావు తన పాత పాసుపుస్తకాలు చూపుతు వీఆర్వో మొదలు కలెక్టర్ వరకు కాల్లరిగేలా తిరిగిన ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ సర్కార్ రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా అందిస్తున్న రైతు బంధులొ సైతం అధికారు తప్పిదం కారణంగా సగం మొత్తాన్ని నష్టపోయాడు. ఈ విషయం గ్రామ పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించిన ఫలితం లేకపోయిందని దీంతో మనస్తాపానికి గురై కలుపు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత రైతు భార్య రమాదేవి తెలిపింది.