- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంఎస్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్..
దిశ, స్పోర్ట్స్: ఎంఎస్ ధోనీ.. సన్నాఫ్ సచిన్ టెండుల్కర్ ఏంటని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇదేమైనా కొత్త సినిమా పేరని అనుకుంటున్నారా? ఆగండి.. మేం అసలు విషయం చెబుతాం. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వెలువడగా ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. రాయ్‌పూర్‌లోని పాఠశాల కోసం 15 మందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలిచారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంటర్వ్యూకు హాజరుకాకపోవడంతో అధికారులు ఆరా తీశారు. తీరా ఆ వ్యక్తి ఒక ఆకతాయని తెలిసింది. అతడి దరఖాస్తు పరిశీలించగా మహేంద్ర సింగ్ ధోనీ అని ఉన్నది. తండ్రి పేరు సచిన్ టెండుల్కర్‌గా పేర్కొన్నాడు. అంతే కాకుండా దుర్గ్‌లోని ఒక యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసినట్లు తెలిపాడు. ఇవన్నీ పరిశీలించకుండానే సదరు వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచారు.
అతడు గైర్హాజరు కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 14,850 ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈ విషయం బయటకు తెలియడంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి రౌండ్‌లోనే అతడిని గుర్తించి బయటకు పంపకుండా ఇంటర్వ్యూ వరకు ఎలా తీసుకొని వస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా అధికారుల తప్పిదమే అని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు సదరు వ్యక్తిపై పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేవారు. దరఖాస్తులో పేర్కొన్న ఫోన్‌కు కాల్ చేసినా ఫోన్ స్విచ్చాఫ్ వస్తున్నది.