యాక్షన్ స్టంట్స్‌లో తీవ్రంగా గాయపడ్డ ఫాహద్ ఫజిల్..

by Jakkula Samataha |
యాక్షన్ స్టంట్స్‌లో తీవ్రంగా గాయపడ్డ ఫాహద్ ఫజిల్..
X

దిశ, సినిమా : మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. ‘మలయన్‌కుంజు’ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా కొంచెం ఎత్తు నుంచి కిందకు దూకాల్సి ఉండగా.. ఈ స్టంట్ ప్రయత్నించబోయిన హీరో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. దీంతో ముఖంతో పాటు శరీరంలో పలు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందించిన వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మలయన్‌కుంజు’ చిత్రాన్ని సాజిమోన్ ప్రభాకరన్ డైరెక్ట్ చేస్తుండగా.. ఫిల్మ్ మేకర్ మహేశ్ నారాయణన్ స్క్రిప్ట్ అందించారు. అంతేకాదు మహేశ్ కెమెరాతో పాటు ఎడింటిగ్‌లోనూ తన సేవలు అందిస్తున్నారు.

Advertisement

Next Story