డీలర్‌ షాపుల్లో మరిన్ని ఉద్యోగాల కోత!

by Harish |
డీలర్‌ షాపుల్లో మరిన్ని ఉద్యోగాల కోత!
X

ముంబయి: కొవిడ్‌-19 కారణంగా ఆటోరంగం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక కార్ల తయారీ కంపెనీల షోరూమ్‌ల్లో ఉద్యోగాల కోత మొదలైంది. చాలా వరకు తక్కువ మందితోనే పనులు జరిపిస్తున్నారు. అయితే, ఈ సంక్షోభం కారణంగా మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటో మొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) అంచనా వేస్తున్నది. 2019లో మందగమనం కారణంగా 2లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, కరోనా సంక్షోభం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డీలర్ల సమాఖ్య చెబుతున్నది. ఈనెల ఆఖరి నాటికి ఈ అంశంపై స్పష్టత ఉంటుందని, డీలర్ షాపులను తగ్గించడం, ఉద్యోగాలను తొలగించడం తదితర అంశాలపై డీలర్ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని ఎఫ్ఏడీఏ తెలిపింది. ఎలాంటి మార్పులతో డీలర్లు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవడానికి మేం సర్వేను చేపడుతున్నామని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలె చెప్పారు. ఈనెల చివరి నాటికి గిరాకీ పుంజుకోకపోతే ఉద్యోగాల తొలగింపు తప్పదని ఆయన పేర్కొన్నారు. మాకు విలువైన వనరు ఉద్యోగులని, శిక్షణ పొందిన వారిని వదులుకోవడం అంత సులభమైన విషయం కాదని ఆశిష్ పేర్కొన్నారు. డీలర్ షాపులు మనుగడ సాగించాలంటే ఉద్యోగుల తొలగింపు మాత్రమే చివరి అవకాశంగా కనిపిస్తుందని ఆశిష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed