వర్చువల్ దివాళీ చాలెంజెస్..

by Harish |
వర్చువల్ దివాళీ చాలెంజెస్..
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న తరుణంలో, ఈ ఏడాది దీపావళి ఇంట్లోనే జరుపుకునేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో, వర్చువల్ దివాళీ వేడుకలు చేసుకోవాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా గ్రీటింగ్స్ సెండ్ చేస్తూ, ఈ కామర్స్ వెబ్‌సైట్ సాయంతో ఆత్మీయులకు దివాళీ స్వీట్స్, గిఫ్ట్స్ పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్చువల్ దీపావళిని మరింత బ్రైట్‌ఫుల్‌గా జరుపుకోవడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అందిస్తున్నాయి.

దీపావళి పండగ కోసమే ప్రత్యేకంగా ఫేస్‌బుక్ దివాళీ రెడీ అవతార్లను సిద్ధం చేసింది. దాంతోపాటు, కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి పరిమితమైన దివాళీ సెలబ్రేషన్స్ చాలెంజెస్ తీసుకొచ్చింది.

హ్యాష్‌ట్యాగ్ చాలెంజెస్:

ఇంటిల్లిపాది కలిసి దీపావళీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముంగిట్లో రంగవల్లులు, గుమ్మాలకు పూల తోరణాలు, ఇంటా, బయటా దీపకాంతులతో, కుటుంబ సభ్యుల సంతోషాలతో ప్రతి ఇల్లు చీకటి వేళ వెలిగిపోతోంది. ఇక అమ్మ, అక్కయ్యలు చేసే స్వీట్లు, అందరూ కలిసి చేసుకునే లక్ష్మి పూజలు దీపావళి ప్రత్యేకమనే చెప్పుకోవాలి. మనం చేసుకునే ఈ సెలబ్రేషన్స్ ఫొటోలను, వీడియోలను దివాళీ ఎట్ హోమ్ చాలెంజెస్ హ్యాష్‌ట్యాగ్ పేరుతో (DiwaliAtHomeChallenge) సోషల్ మీడియాలో షేర్ చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు చాలెంజ్ విసురుతూ ట్యాగ్ చేయొచ్చు.

క్రియేటివిటీ దీపావళి..

దివాళీ వేడుకల్లో భాగంగా కొంతమంది వేస్ట్‌గా పడేసిన బల్బులను ఉపయోగించి కొవ్వొత్తి హోల్డర్లను తయారు చేస్తుంటారు. ఇంకొందరు రీసైకిలింగ్ వాటితో హ్యాంగింగ్ ల్యాంతర్లు రూపొందించడం, రకరకాల వాటితో కొవ్వొత్తులను తయారు చేయడం చేస్తుంటారు. ఇలా మనం కూడా ఏదైన తయారుచేసి దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు రూపొందించి, ‘డిఐవైదివాళీ చాలంజ్’ (DIYDiwaliChallenge) హ్యాష్‌ట్యాగ్‌తో స్నేహితులను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేయొచ్చు.

అవతార్:

దివాళీ పండుగ సందర్భంగా దీపావళి థీమ్‌తో కూడిన అవతార్‌లతో స్పెషల్ పోస్ట్ కూడా చేయొచ్చు అవతార్‌కు మ్యాచ్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ కూడా జత చేసుకోవచ్చు. ఇందుకోసం ఎఫ్‌బీ‌లో “క్రియేట్ పోస్ట్” ట్యాప్ చేసి, “బ్యాక్‌గ్రౌండ్ కలర్” సెలెక్ట్ చేసుకుని, దీపావళి నేపథ్యాన్ని ఎంచుకోవచ్చు.

దివాళీ కాంటాక్ట్ :

స్పెషల్లీ దివాళీ కంటెంట్ కోసం హ్యాష్‌ట్యాగ్ దివాళీ 2020, హ్యాష్‌ట్యాగ్‌శుభ్‌దివాళి2020 అనే సెర్చ్ చేయొచ్చు. ఇక ఇన్‌స్టా యూజర్ల కోసం ఏఆర్ ఎఫెక్ట్‌తో కూడిన ‘షేర్ యువర్ లైట్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Advertisement

Next Story