చౌరస్తాలో భారత్-చైనా సంబంధాలు: జైశంకర్

by Shamantha N |
చౌరస్తాలో భారత్-చైనా సంబంధాలు: జైశంకర్
X

న్యూఢిల్లీ: గత ఏడాది తూర్పు లఢాఖ్‌లో జరిగిన సంఘటనలు భారత్, చైనా మధ్య సంబంధాలను ‘చౌరస్తా’లోకి తీసుకువచ్చాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అంగీకరించారు. ఈ ఘర్షణలు రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి తీవ్ర పరిణమాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం 13వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ చైనా స్టడీస్‌ను ఉద్దేశించి జైశంకర్ మాట్లాడారు. లఢాఖ్‌లో భద్రతా బలగాలను కనిష్ఠ స్థాయిలో తగ్గిస్తామనే మాటకు కట్టుబడి ఉండకపోవటమే కాకుండా శాంతికి భంగం కలిగించడానికి వెనుకాడలేదని విమర్శించారు. చైనా వైఖరిలో మార్పు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలను భారీగా సేకరించడంపై తమకు విశ్వసనీయమైన వివరణ రాలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed