- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైన కంకర..లోన మందుగుండు
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి జగిత్యాలకు అక్రమంగా తరలిస్తున్న మందుగుండు సామగ్రిని జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌లో కంకర మాటున పేలుడు పదార్థాల అక్రమ రవాణా అవుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు గొల్లపల్లి బైపాస్ రోడ్డుపై తనిఖీలు చేపట్టారు. టీఎస్ 02 ఈడబ్లు 4075 ట్రాక్టర్ ను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న మందుగుండు సామగ్రి లభ్యమైందని అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి తెలిపారు.అందులో 13 బస్తాల అమ్మోనియం నైట్రేట్, మూడు కాటన్ పేలుడుకు ఉపయోగించే స్లోరి, రెండు కాటన్ల డిటోనేటర్లను పట్టుకున్నామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను విచారించగా చొప్పదండి గ్రామానికి చెందిన మంద అంజయ్య తమకు మందుగుండు సామగ్రి అప్పగించి జగిత్యాలలోని కోరెం ప్రవీణ్, హన్మంతరావులకు చేర్చాలని చెప్పారన్నారు. వీరిపై మందుగుండు సామగ్రి అక్రమ రవాణా సెక్షన్లలో కేసు నమోదు చేశామని, ట్రాక్టర్ డ్రైవర్ నరేష్‌తో పాటు బూర్ల చంద్రశేఖర్‌లను అరెస్ట్ చేశామన్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు అడిషనల్ ఎస్పీ వివరించారు.కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు.