- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌లో 74 ఎక్సైజ్ కేసులు నమోదు
దిశ, హైదరాబాద్ :
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే, మద్యం వ్యసనానికి గురైనవారికి అది ఎక్కడా దొరక్కపోవడంతో..మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కాగా, మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాటు సారా తయారీ కేంద్రాలతో పాటు లైసెన్సులు లేకుండా నడుస్తున్న షాపులు, బార్లపై హైదరాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు సోదాలు చేసి 74 కేసులు నమోదు చేశారు. జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్ 24 శుక్రవారం వరకు నమోదైన కేసుల వివరాలను అధికారులు విడుదల చేశారు. ఈ కేసుల్లో మొత్తం 94 మందిని అరెస్టు చేశారు. 4518 లీటర్ల బీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా మద్యం అమ్ముతున్న వారిపై 17 కేసులు నమోదు కాగా, 19 మందిని అరెస్టు చేశారు. ఈ సమయంలో 259 లీటర్ల ఐఎంఎల్, 109 లీటర్ల బీర్‌ను పట్టుకున్నారు.
నాటు సారా తయారీదారులపై 55 కేసులు బుక్ చేసి, 75 మందిని అరెస్టు చేయగా, 201 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2509 సారా బట్టీలను ధ్వంసం చేయగా.. 13,630 కిలోల నల్ల బెల్లం, 1548 కిలోల ఆలమ్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా 2 ఫోర్ వీలర్లు, 3 టూ వీలర్లు, 4 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా కోర్టులు పనిచేయకపోవడంతో నిందితులను సొంత పూచీకత్తు బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. లేదంటే దర్యాప్తు కోసం ఎక్సైజ్ స్టేషన్లకు హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తున్నారు.
Tags: Excise Department, Rides, Case filed, Lock down, Beer