- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ స్కూల్ ఓనర్‌తో సీఐ ఎఫైర్.. చితక్కొట్టిన భర్త
దిశ ప్రతినిధి, నిజామాబాద్: వివాహం జరిగి భార్య, పిల్లలు ఉండగానే మరొక మహిళ(వివాహిత)తో ఎఫైర్ పెట్టుకున్నాడు ఎక్సైజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సీఐ. ఈ పనికి సదరు మహిళ భర్త, కుటుంబీకులు సీఐ అని చూడకుండా దేహశుద్ధి చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కోడై కూస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహితతో సదరు సీఐకి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఏడాదిన్నరగా కరోనా, లాక్‌డౌన్ ఉండడంతో స్కూల్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఐ, ఆ మహిళ(స్కూల్ ఓనర్) కలుసుకోవడం వీలుపడలేదు.
Read more: స్నేహం ముసుగులో కమిట్‌మెంట్.. హీరోయిన్స్‌తో వారి వెకిలి చేష్టలు
ఇక బుధవారం నుంచి స్కూల్స్ రీఓపెన్ అయిన నేపథ్యంలో వీరిద్దరు కలిసి ఐదురోజుల టూర్ వేసుకున్నారు. మైసూర్‌లో ఎడ్యుకేషన్ హబ్ టూర్ ఉందని వివాహిత.. భర్త వద్ద పర్మిషన్ తీసుకుంది. ఇదే సమయంలో సదరు సీఐ కూడా ఐదురోజుల పాటు లీవ్ పెట్టాడు. గురువారం వీరిద్దరు స్కూల్‌లో కలుసుకున్నారు. ఇదే సమయంలో అటు వచ్చిన వివాహిత భర్త.. ఎడ్యుకేషన్ హబ్ టూర్‌పై ఆరా తీసి.. అంతా ఫేక్ అని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులను వెంటేసుకొచ్చి సీఐకి దేహశుద్ధి చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇదే వ్యవహారంపై స్టేషన్‌లో ఫిర్యాదు కోసం వెళ్తే పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని సమాచారం. అంతేకాకుండా సదరు సీఐపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది.