- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3డీ రూపు సంతరించుకోనున్న స్ప్రెడ్‌షీట్‌లు
స్ప్రెడ్‌షీట్‌లు ఎలా నిర్వహించాలో తెలిస్తే ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవచ్చని అంటారు. ఏ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ స్ప్రెడ్‌షీట్ అవసరం ఉంటుంది. ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి, సంస్థ పురోగతిని తెలుసుకోవడానికి, ఇంకా మరెన్నో అవసరాలకు స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగిస్తారు. అదొక ప్రాథమిక అవసరంగా మారింది. కానీ గత కొన్నేళ్ల నుంచి స్ప్రెడ్‌షీట్‌లు అలాగే ఉన్నాయి. గూగుల్ షీట్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదా ఇంకేదైనా స్ప్రెడ్‌షీట్ టూల్ అయినా.. ఫీచర్లు చేరాయే తప్ప రూపురేఖలు మారలేదు. త్వరలో వాటి రూపు మారబోతోంది.
మైక్రోసాఫ్ట్ రీసెర్చికి చెందిన నిపుణులు, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, మిక్స్‌డ్ రియాలిటీ ల్యాబ్ వారితో కలిసి స్ప్రెడ్‌షీట్‌లకు త్రీడీ రూపునివ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వర్చువల్ రియాలిటీ, మిక్స్‌డ్ రియాలిటీని ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇదే గనక అమల్లోకి వస్తే.. గ్రాఫ్‌లు, చార్టులను త్రీడీలో చూసుకోవచ్చు. త్రీడీ వర్చువల్ స్పేస్‌లో విభిన్న స్ప్రెడ్‌షీట్‌లను కలిపి డేటాను త్రీడీలో చూపించుకోవచ్చు. హెచ్‌టీసీ వైవ్ ప్రో హెచ్‌ఎండీ హెడ్‌సెట్, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 4 టాబ్లెట్ ఉపయోగించి నిపుణులు ఈ త్రీడీ స్ప్రెడ్‌షీట్‌లను పరీక్షించారు.