- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో 5 లక్షలు.. ఇక్కడ మాత్రం 60 వేలే

దిశ, నల్లగొండ: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ వివేక్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
కరోనా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కరోనా విషయంలో కేసీఆర్ ప్రతిపక్షాలతో చర్చించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీలో 5 లక్షల కరోనా పరీక్షలు చేస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 60 వేలు మాత్రమే చేశారని మండిపడ్డారు. విమర్శలు రావడంతోనే కల్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్నిసీఎం పరామర్శించారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు.