- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈటల సెన్సేషనల్ కామెంట్స్
దిశ, హుజూరాబాద్: తెలంగాణలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన విజయం ఖాయం అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హుజూరాబాద్‌లోని వెంకటసాయి గార్డెన్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులను డబ్బులకు ప్రలోభ పెట్టడం దారుణమైన విషయం విమర్శించారు. అని అన్నారు. కొంతమంది అధికారులు హుజురాబాద్‌లో తప్పుడు పద్ధతిలో ప్రవర్తిస్తున్నారని వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా హుజరాబాద్‌లో బీజేపీ విజయం ఖాయమని అన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ భూములను ఇష్టం వచ్చిన రీతిలో అమ్మడానికి కేసీఆర్‌కు అధికారం ఎక్కడిది అని ప్రశ్నించారు. తెలంగాణ కేసీఆర్ తాత జాగీరా.. అని బండి సంజయ్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ ఇండ్లు, పరిశ్రమల ఏర్పాటుకు భూములు లేవని చెప్పిన కేసీఆర్ ఆయన కుటుంబానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన బూతు చానల్ ద్వారా తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు కేసీఆర్ చేయిస్తున్నాడని ఆరోపించారు. నిజమైన ఉద్యమ కారునిపై బూతు చానెల్ తప్పుడు ప్రసారాలు చేయించడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్‌కు తన ఆస్తులు పెంచుకోవడమే తప్పా రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూములు లభ్యం కావు కానీ, కబ్జా చేసుకోవడానికి ఎలా వస్తున్నాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసే నాయకులకు, నిజాలను నిర్భయంగా చెప్పే నాయకులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానంలో లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్‌లో కేసీఆర్ ఎందుకు లేడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా ఉప ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 150 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణమైన కేఎంసీ ఆసుపత్రిని ప్రారంభించకుండా జైలును కూలగొట్టి అక్కడ ఎంజీఎం నిర్మాణం చేపడుతామని చెప్పడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. జైలు కూల్చడానికి ఎలాంటి అధికార ఉత్వర్వులు జారీ చేయ్యలేదని. ఖైదీలను తరలించే క్రమంలో ఏదైన సంఘటన జరిగితే ఎవరిది బాధ్యత అని అన్నారు. జైలు కూల్చడంలో కేసీఆర్ కుట్ర దాగి ఉందని అన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దండుపాళ్యం ముఠాను తరిమి కొడుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.