- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ పని చేయకుంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా : మాజీ ముఖ్యమంత్రి
ముంబై: మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కోటా పునరుద్ధరించాలని బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఈ కోటాను కాపాడటంలో శివసేన ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ రాస్తారోకోలు చేసింది. నాగ్‌పూర్‌లో వెరైటీ స్క్వేర్ దగ్గర నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఓబీసీ కోటా పునరుద్ధరణ రాష్ట్ర స్థాయి అంశమేనని, అందుకు కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని అన్నారు. శివసేన ప్రభుత్వం కోటాను పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీజేపీకి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఈ కోటాను తాను తప్పకుండా పునరుద్ధరిస్తానని, లేదంటే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని అన్నారు. రాష్ట్ర సచివాలయం ముందు ధర్నా చేయాలనే లక్ష్యంతో ముంబైలో సిద్ధమవుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాగ్‌పూర్‌లో దేవేంద్ర ఫడ్నవీస్‌నూ పోలీసులు అరెస్టు చేశారు.