- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KKR కెప్టెన్ మారనున్నాడా?
దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్ (Team captain)ను మార్చే ఉద్దేశంతో ఉన్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం ఆ జట్టుకు దినేష్ కార్తీక్ (Dinesh karthik) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్‌లో KKR జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న.. కీలక మ్యాచ్‌లలో నాయకత్వ లోపం కనిపించింది.
అయితే ఈ సీజన్‌లో జట్టులోకి కొత్తగా ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Iyan morgan)చేరాడు. KKR కనుక ఐపీఎల్ తొలి మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన చేయకపోతే కెప్టెన్సీని మోర్గాన్‌కు కట్టబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. మాజీ క్రికెటర్, సీనియర్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil gawaskar) కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals)జట్టు సీజన్ మధ్యలో రహానే (Rahane)ను కెప్టెన్‌గా తప్పించి స్టీవ్ స్మిత్ (Steve smith)కు కట్టబెట్టారని.. ఈ ఏడాది KKR విషయంలో అదే జరగొచ్చని గవాస్కర్ అంటున్నారు. మొదటి నాలుగైదు మ్యాచ్‌లు చూసిన అనంతరం కేకేఆర్ యాజమాన్యం ఒక నిర్ణయానికి రావొచ్చని తెలుస్తున్నది.