శ్రమజీవుల ‘నిరసన’ గళం.. ఎంజాయ్ ఎంజామి

by Shyam |
rapper Arivu
X

దిశ, ఫీచర్స్: ‘కాటుక కనులే, మెరిసిపోయే పిలడా నిను చూసి’ అంటూ మధురై యాసలో మనల్ని మైమరిపించినా.. ‘హే గోలి సోడావే, హే కర్రికులాంబే’ అంటూ హుషారెత్తించినా.. ఆ గాత్రం విభిన్నం, ఆ గానం సుమధురం. అంతెందుకు 100 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి, ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘ఎంజాయ్ ఎంజామి’ సాంగ్ కూడా ఆ గళం నుంచి జాలువారిందే. ర్యాప్, పాప్, ఫోక్ మిక్స్ చేసి పాడిన ఈ పాట లేటెస్ట్ సెన్సేషన్‌గా కొనసాగుతుండగా.. ఫస్ట్ ఎవర్ ఇండిపెండెంట్ సాంగ్‌తో రచ్చ చేస్తున్న ఆ గాయకురాలే దీక్షిత వెంకటేశన్(దీ). ఈ యంగ్ ప్లేబ్యాక్ సింగర్ విశేషాలు తెలుసుకుందాం.

దీక్షితా వెంకటేశన్ శ్రీలంకన్ తమిళ ప్లేబ్యాక్ సింగర్ కాగా, ప్రొఫెషనల్లీ ఆమె ‘దీ’గా పాపులర్ అయింది. తమిళ శాస్త్రీయ సింగర్ మీనాక్షి అయ్యర్‌కు జన్మించిన దీక్షిత చిన్నప్పటి నుంచే సంగీత పాఠాలు నేర్చుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ దీక్షితకు స్టెప్ ఫాదర్ కాగా, ఆయన సంగీత సారథ్యంలోనే ‘పిజ్జా-2’ చిత్రంతో ప్లే బ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చింది. మద్రాస్ మూవీలోని ‘నాన్ నీ’ పాట ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘దీ’ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడినా తన కెరీర్‌లో గుర్తుండిపోయే పాటగా నిలిచింది మాత్రం ‘రౌడీ బేబీ’. ఈ పాట తర్వాత తమిళనాట అందరూ ఆమెను ‘గోలీ సోడా అక్క’గా పిలవడం ప్రారంభించారు. ఇక ఇటీవలే వచ్చిన ‘కాటుక కనులే’ పాట కూడా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. తాజాగా రిలీజైన తన తొలి ప్రైవేట్ సాంగ్ ‘ఎంజాయ్ ఎంజామి’ కూడా హ్యూజ్ సక్సెస్ సాధించింది.

మొత్తం సమయాన్ని సంగీతానికే వెచ్చించా..

మా అమ్మ, బామ్మ ఇద్దరూ నాకు కర్ణాటక సంగీతం నేర్పించేవారు. కానీ శ్రద్ధగా నేర్చుకోలేదు. నాకు 14 ఏళ్ళ వయసులో.. సంతోష్ అప్పా కోసం నా మొదటి పాట (డిస్కో ఉమెన్) పాడాను. ఆ తర్వాత సంగీతం గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పాడాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో స్కూల్‌కు బంక్ కొట్టి, నా మొత్తం సమయాన్ని సంగీతం నేర్చుకునేందుకే వెచ్చించా. ఈ మేరకు ఇళయరాజా, ఏఆర్ఆర్, ఎంఎస్‌వీ పాటలతో పాటు ఎల్లా ఫిట్జ్‌గెరాల్డ్, నినా సిమోన్, సంతోష్ నారాయణన్, కేండ్రిక్ లామర్, బిల్లీ హాలిడే, ప్రదీప్ కుమార్, అనంతు, సీన్ రోల్డెన్ వంటి ప్రతిభావంతమైన మ్యూజిషియన్స్ నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేశారు. – దీ, ప్లే బ్యాక్ సింగర్

ట్రెండింగ్ సాంగ్..

ప్రతి పాటకు ఓ థీమ్ ఉంటుంది. కానీ అన్ని థీమ్స్ గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ‘ఎంజాయ్ ఎంజామి’ పాట యూత్ ఆడియెన్స్‌కు కావాల్సిన వెస్ట్రన్ బీట్స్ అందిస్తూనే, విలువైన లైఫ్ లెస్సన్స్ అందించింది. జీవితాన్ని, ప్రకృతిని ఆస్వాదిస్తూనే వాటిని కాపాడటం గురించి మాట్లాడుతుంది. మన మూలాలను గుర్తుంచుకోవాలని, పూర్వీకుల సంస్కృతిని కొనసాగించాలనే విషయాన్ని ఇందులో చర్చించారు. ఎంజామి అనేది ప్రేమతో కూడిన పదం. ‘ఎన్ సామి’ నుంచి ఈ పదం రాగా, దానికి ‘నా ప్రభువు’ అని అర్థం. ఇది భూమిలేని కూలీలు తమ యజమానులను సూచించడానికి ఉపయోగించే వర్డ్. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ వీడియో సాంగ్‌లో భూమి లేని శ్రమజీవుల ‘నిరసన’ గళం ఉంది. భూమి హక్కుల పోరాటమూ ఉంది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్, ఏ ఆర్ రెహ‌మాన్‌లు సంయుక్తంగా నిర్మించారు. యంగ్ ఇండీ మ్యూజిషియన్స్‌ను ప్రోత్సహించేందుకు ‘మజ్జా’పేరుతో వీరిద్దరూ కలిసి ఓ వేదికను ఏర్పాటు చేయగా.. ‘మజ్జా’ నుంచి వచ్చిన తొలి పాటే ‘ఎంజాయ్ ఎంజిమి’.

ఇక సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ ధనుష్, దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి, సిద్ధార్థ్, ఏఆర్ రెహమాన్, శ్వేతా మోహన్, విఘ్నేష్ శివన్, లోకేష్ కనకరాజ్, పా రంజిత్, సెల్వరాఘవన్ తదితరులు నుంచి ఈ పాటకు ప్రశంసలు దక్కాయి.

Advertisement

Next Story