- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ ఐపీఎల్ ప్లేయర్లకు టెస్టులో నో చాన్స్?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో ఆడిన ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లకు న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయబోవడం లేదని తెలుస్తున్నది. ఇటీవల ఐపీఎల్ రద్దు కావడంతో ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన క్రికెటర్లు ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, జూన్ 2 నుంచి న్యూజీలాండ్‌తో ఇంగ్లాండ్ జట్టు రెండు టెస్టులు ఆడనున్నది. అయితే ఐపీఎల్ ప్లేయర్లకు రెడ్ బాల్‌తో తగినంత ప్రాక్టీస్ లేకపోవడంతో వారిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తున్నది.
జానీ బెయిర్‌స్టో, జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, మొయిన్ అలీ వంటి క్రికెటర్లను టెస్టుల్లోకి ఎంపిక చేయరని సమాచారం. ఐపీఎల్ ప్లేయర్లు దూరం కావడంతో ఓలీ రాబిన్‌సన్, క్రెయిగ్ వోవర్టన్, జేమ్స్ బ్రేసీ లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు బీబీసీ స్పోర్ట్స్ ఒక కథనం ప్రచురించింది. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ కూడా ధృవీకరించడం గమనార్హం.