- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీ వర్షం ఎఫెక్ట్.. రజినీకాంత్ గల్లంతు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి, గండీపేట్: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో గత మూడు నెలల నుంచి డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. మణికొండ, పుప్పాల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీటిని మూసీలోకి మళ్లించేందుకు డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా కాంట్రాక్టర్లు గుంతలు తీయడం జరిగింది. శనివారం కురిసిన భారీ వర్షానికి ఆ డ్రైనేజీ గుంతల్లో నీరు నిలిచి ఉండడంతో దారి బాగానే ఉందని వెళ్తున్నారు. కానీ, ఆ దారి మధ్యలో గుంత ఉన్నట్లు డ్రైనేజీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, అధికారులు ఏలాంటి సూచనలు చేయకపోవడంతో ప్రజలు ప్రమాదం ఉందని గుర్తించలేకపోయారు.
ఈ డ్రైనేజీ పనులు జరిగే మార్గంలోనే అవసరాల కోసం వెళ్లే వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఆ దారి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి జారి డ్రైనేజీ గుంతలో పడిపోయారు. భారీ వర్షాన్ని మోబైల్లో వీడియో తీస్తున్న స్ధానికుడు డ్రైనేజీ గుంతలో పడిపోయిన విషయాన్ని గుర్తించి నార్సింగ్ పోలీసులకు 100 ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం మణికొండకు చెందిన ఓ కుటుంబం రజినీకాంత్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు డ్రైనేజీలో కొట్టుకపోయిన వ్యక్తి రజినీకాంత్‌గా అనుమానిస్తున్నారు. ఇతను షాద్‌నగర్ పవర్ ఫ్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.
డ్రైనేజీలో కొట్టుకపోయిన రజినీకాంత్ కోసం డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడి, అదనపు కలెక్టర్ పాత్రికేయులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తిని గుర్తించాలని స్ధానిక మున్సిపల్ చైర్మన్, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది డ్రైనేజీ పనులు చేపట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. డ్రైనేజీ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండంగా ఉంటుందని తెలిపారు.