- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైరల్‌గా మారిన శాంటా ఏనుగు.. పిల్లలకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చిందో తెలుసా?
దిశ, ఫీచర్స్: క్రిస్మస్ సందర్భంగా చిన్నారులెంతో మంది బుజ్జి బుజ్జి శాంటాలుగా మారిపోవడం ప్రతీ ఏటా చూస్తూనే ఉంటాం. అయితే ఇటీవల కాలంలో తమ పెంపుడు శునకాలు, పిల్లుల్ని కూడా శాంటాలుగా రెడీ చేస్తుండగా, థాయ్‌లాండ్‌లో ఏనుగులకు శాంటా టోపీతో పాటు సర్జికల్ మాస్క్ పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఈ ఏనుగులు పాఠశాలలో జరిగే వార్షిక క్రిస్మస్ పార్టీలో విద్యార్థులకు హ్యాండ్ జెల్, ఫేస్ మాస్క్, బెలూన్స్ అందించడం విశేషం.
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల నుంచి విద్యార్థులు వర్చువల్ పద్ధతిలోనే చదువుకుంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో హైస్కూల్ విద్యార్థులకు టీకాల వేసిన థాయ్ ప్రభుత్వం, పాఠశాలలకు విద్యార్థులు రావచ్చని పేర్కొంది. అయితే ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఇక ఆన్‌లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతుండగా.. ఒమిక్రాన్ రూపంలో మరోసారి హాజరు పై దాని ప్రభావం కనిపిస్తోంది. దీంతో క్రిస్మస్ వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని భావించిన ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఏనుగులతో పిల్లలకు కొవిడ్ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. శాంటా ఏనుగులతో మాస్క్, శానిటైజర్‌లతో పాటు బెలూన్స్ గిఫ్ట్‌గా అందించాయి. ఈ ఈవెంట్ వారిని సంతోషపెట్టి పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహిస్తుందని స్కూల్ యాజమాన్యం భావిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో థాయిలాండ్‌లో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకోగా, ఇప్పటివరకు 2.2 మిలియన్ల మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. 21,501 మంది మరణించారు.