- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండలి పోరు.. అమల్లోకి ‘కోడ్’
దిశ, తెలంగాణ బ్యూరో : మండలి పోరుకు నగారా మోగింది. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఖమ్మం – వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఏపీలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన ఈస్ట్ గోదావరి-వెస్ట్ గోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఏఎస్‌రామకృష్ణ పదవీకాలం సైతం పూర్తి కానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం మహబూబ్‌నగర్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో మొత్తం 5,17,883 మంది ఓటర్లుండగా, 616 పోలింగ్ కేంద్రాలన్నాయి. వరంగల్– ఖమ్మం–నల్గొండ స్థానంలో 4,91,396 మంది ఓటర్లుండగా 546 పోలింగ్ కేంద్రాలను తుది జాబితాలో ప్రకటించారు.
అమల్లో కోడ్..
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. గురువారం ఉదయమే షెడ్యూల్ సీఈసీ వెలువరించింది. దీంతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ కారణంగా రాష్ట్రంలో పలు పథకాలు వాయిదా పడనున్నాయి. నల్గొండ జిల్లాకు మంజూరు చేస్తామని ప్రకటించిన నిధులు ఆగిపోయాయి. అదే విధంగా పంచాయతీలకు ప్రత్యేకంగా సీఎం నిధి నుంచి ఇచ్చే నిధులకు కూడా బ్రేక్ పడింది.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 16 (మంగళవారం)
నామినేషన్లకు చివరితేదీ : ఫిబ్రవరి 23 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : ఫిబ్రవరి 26 (శుక్రవారం)
పోలింగ్ : మార్చి 14 (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
ఓట్ల లెక్కింపు : మార్చి 17 (బుధవారం)