- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాలెంట్ ఉంటేనే.. రాణిస్తాం : ఈషా రెబ్బా
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్‌తో పాటు ఇతర అన్ని పరిశ్రమల్లోనూ నెపొటిజంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీటౌన్‌లో దీనిపై దుమారం రేగుతుండగా.. తాజాగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘టాలీవుడ్‌లో కూడా నెపొటిజం ఉంది. ఇక్కడ లేదని నేను అనడం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల అవకాశాలు ఈజీగా వస్తాయి. అంతవరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ రాదు. ప్రతిభ ఉంటే మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఆఫర్లు కాస్త తక్కువే వచ్చినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాలెంట్ చూపిస్తే.. కచ్చితంగా మంచి గుర్తింపు లభిస్తుంది’ అని ఈషా చెప్పుకొచ్చింది. అయితే తాప్సీ కూడా ఇలానే స్పందించింది. ఆమె కూడా ప్రతిభ ఉంటే.. అవకాశాలు వస్తాయని తన అభిప్రాయాన్ని చెప్పడంతో.. కంగనా ఫైర్ అయిన విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో మాస్క్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘వేర్ ఏ మాస్క్’ అనే షార్ట్ వీడియోలో ఈషా ఇటీవలే నటించింది. కాగా, ఈ వీడియో కోసం చిరంజీవి గారు తన పేరును సూచించారని తెలిసి ఆశ్చర్యపోయానని ఆమె తెలిపింది. ‘వేర్ మాస్క్.. స్టే సేఫ్’ ఫిల్మ్‌కు మంచి స్పందన వస్తోందని తెలిపింది ఈషా. చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తున్నట్టు తనకు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ కామెంట్స్ వస్తున్నాయన్నారు.