- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
UPSC సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల.. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే?

దిశ,వెబ్‌డెస్క్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 (Civil Services Prelims Exam)తోపాటు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమ్స్) (Indian Forest Service (Prelims)) పరీక్ష నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE)2025 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈ రోజు(బుధవారం) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సారి అన్ని సర్వీసులకు కేవలం 979 ఖాళీలను మాత్రమే. గత ఏడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోల్చితే ఇప్పుడు 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి
UPSC CSE 2025 పరీక్షకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరో వైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు.