నీట్ ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి

by Javid Pasha |
నీట్ ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం రాత్రి రిలీజ్ చేసింది. మొత్తం 20,38,596 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 11,45,976 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. ఇక ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ 720కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇక ఫలితాలు తదితర వివరాల కోసం అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

Advertisement

Next Story