Holidays: విద్యార్థులకు పండగే పండగ.. రేపటి నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

by Kavitha |
Holidays: విద్యార్థులకు పండగే పండగ.. రేపటి నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. అదేంటంటే.. రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా హాలిడేస్ రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 4 రోజులు సెలవు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో 5 రోజులు ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మరి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం..

సెప్టెంబర్ నెల 14వ తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు. ఇక 15వ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా 2 రోజులు సెలవులు. అలాగే.. 16న మిలాద్ ఉన్ నబీ కాబట్టి.. ఆ రోజు సెలవు ఉంటుందనీ, 17న వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండటం వల్ల వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈనెల 14, 15 వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి. కానీ, 16న మిలాద్ ఉన్ నబీ (మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు) పండుగ తేదీ మారింది. ఈ పండుగను 16న కాకుండా 17న జరుపుకోనున్నారు. దాంతో ప్రభుత్వం కూడా 16వ తేదీన సెలవును రద్దు చేసి.. 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. దీంతో వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇక వరుస సెలవులు రావడంతో విద్యార్థులు టూర్లకు ఎక్కువగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed